అచ్యుతాపురం: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ గారి ఆదేశాల మేరకు, మండల పార్టీ అధ్యక్షులు దేశంశెట్టి శంకరరావు గారి ఆధ్వర్యంలో కొండకర్ల, ఎర్రవరం, ఉప్పవరం, జగన్నాధపురం గ్రామాల్లో ఈ కార్యక్రమం జరిగింది.*ఈ సందర్భంగా దేశంశెట్టి శంకరరావు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలను గ్రామస్థాయిలో మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.కోన బుజ్జి మాట్లాడుతూ కార్యకర్తలు పార్టీకి బలమైన పునాది అని పేర్కొన్నారు. లాలం రాంబాబు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని వారికి అండగా నిలవాలని అన్నారు. నర్మల కుమార్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ కార్యకర్తల సమన్వయం, చురుకైన భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి కోన బుజ్జి, రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శి లాలం రాంబాబు, మాజీ కో-ఆప్షన్ జడ్పీటీసీ నర్మల కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి భీముని వెంకటేశ్వరరావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి రవీంద్ర రాజు, మాజీ సర్పంచ్ గంగిరెడ్డి రాము.అలాగే చిన్ని సత్తిబాబు, బుద్ధిరెడ్డి భాస్కర్, రవి, శోభన్, కాశీనాయుడు, భీముని నాగేశ్వరావు, కట్టుమూరి శ్రీనివాసరావు, సిరసపల్లి సత్యనారాయణ, గంగిరెడ్డి రోహిత్, అప్పికొండ రాము, చిన్నారావు, శ్రీను, దేముడు, బాబూరావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు