ఈ నెల 27 నుంచి ఇంటింటికీ కూటమి పథకాల ప్రచారం: బడేటి చంటి..
17/July/2026 20:00
Share:
ఏలూరు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జైత్రయాత్ర సాగించేలా, వార్ వన్‌సైడ్‌గా సాగేలా క్యాడర్ పరిశ్రమించాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పిలుపునిచ్చారు. ఇదేక్రమంలో ఈ నెల 27వ తేదీ నుండి చేపట్టనున్న ఇంటింటికీ కార్యక్రమంలో ప్రతిఒక్క కార్యకర్తా క్షేత్రస్థాయిలో ముందుకు కదిలి రెండేళ్ళ పాలనా కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన మేళ్ళను ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. తమ వినతులను జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి అందించి, తమకు మేళ్ళు చేకూర్చి పెట్టాలని విన్నవించారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన ఎమ్మెల్యే చంటి,,, వారి నుండి వినతి పత్రాలను స్వీకరించి, సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకుని, అక్కడికక్కడే ఫోన్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు. పలువురు తమకు ఇంటి స్థలాలను కేటాయించాలని వినతులు సమర్పించగా,,, మరికొందరు తమకు పెన్షన్లు మంజూరు చేయాలని అర్జీలను ఇచ్చారు. వారందరికీ భరోసా కల్పించిన ఎమ్మెల్యే చంటి,,, సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టనున్నట్లు వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ఇదేక్రమంలో ఈ నెల 27వ తేదీ నుండి కూటమి ప్రభుత్వ రెండేళ్ళ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమాల మేళ్ళను వివరించేందుకు చేపట్టిన ఇంటింటికీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు క్యాడర్ సంసిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం 45 రోజుల పాటూ నియోజకవర్గంలో కొనసాగనుందని పేర్కొన్న ఎమ్మెల్యే చంటి,,, తదనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నగారా మ్రోగనుందని, అందుకు సన్నద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. అందుకు అనువుగా ప్రతీ కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండాలని, లోకల్ ఎలక్షన్ వార్‌ను వన్‌సైడ్ చేసేందుకు కూడా పరిశ్రమించాలని ఎమ్మెల్యే చంటి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటి మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నాయకులు బెల్లపుకొండ కిషోర్, పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, డివిజన్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు... కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,