క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ యలమంచిలి,
యలమంచిలి–మాకవరపాలెం (వాకరోడ్డు) విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణ పూర్తిగా చట్టబద్ధంగానే జరిగిందని యలమంచిలి తహసీల్దార్ కె. వరహాలు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.గురువారం కొన్ని పత్రికల్లో భూసేకరణపై వచ్చిన కథనాల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ, భూసేకరణ, పునరావాసం, పునస్థాపనలో న్యాయమైన పరిహారం మరియు పారదర్శకత హక్కు చట్టం–2013 ప్రకారం భూస్వాములకు నిబంధనల మేరకు నోటీసులు జారీ చేసి, అభ్యంతరాలు స్వీకరించి, విచారణ అనంతరం అన్ని చట్టపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాతే భూసేకరణ చేపట్టినట్లు తెలిపారు.భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, భూ యజమానుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే అధికారులు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.ప్రజలు వాస్తవాలను తెలుసుకుని అపోహలకు లోనుకాకుండా అధికారుల నుంచి సరైన సమాచారం పొందాలని తహసీల్దార్ వరహాలు కోరారు. అలాగే భూసేకరణకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే రెవెన్యూ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.