మెరకముడిదం,సన్ రైస్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

మెరకముడిదం,సన్ రైస్ స్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు..

14/November/2026 21:38    Share:   

మెరకముడిదం: సన్ రైస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఏ. అరుణకుమారి, చైర్మన్ ఏ. నాగరాజు, ప్రిన్సిపాల్ బి.వి. మూర్తి మాట్లాడుతూ బాలలే దేశ భవిష్యత్తుకు పునాదులని, విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు అలవర్చుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో ఉన్న ప్రతిభను గుర్తించి, వారి ఉన్నత లక్ష్యాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు.ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించి, వారి హక్కులను పరిరక్షించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
క్రైమ్ ఎనాలసిస్ విజయనగరం జిల్లా ఇంచార్జ్ మందపాటి సూర్యనారాయణ
Breaking News

Subscribe our Newsletter