అనకాపల్లిలో విశేష స్పందన నోచుకున్న గోవిందన్న 'ప్రజా దర్బార్'
17/May/2026 07:08
Share:
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం: పీలా గోవింద సత్యనారాయణ ..! అనకాపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు "ప్రజా ప్రభుత్వం - ప్రజల వద్దకే పాలన" ఆశయాలకు అనుగుణంగా ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అనకాపల్లిలో నిర్వహించిన 'ప్రజా దర్బార్' (గ్రీవెన్స్ సెల్) కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం గవరపాలెంలోని పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ ప్రజా దర్బార్‌కు నియోజకవర్గ నలుమూలల నుంచి వృద్ధులు, మహిళలు, రైతులు, దివ్యాంగులు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు.తక్షణ స్పందన: ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన గోవిందన్న.. పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, వైద్య సహాయం, డ్రైనేజీ తదితర సమస్యలపై అక్కడికక్కడే స్పందించారు. సంబంధిత ప్రభుత్వ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేశారు.పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తల కుటుంబ, ఆర్థిక సమస్యలను ఆయన సావధానంగా విన్నారు. "నా కార్యకర్త కంట కన్నీరు చూడను, మీ కుటుంబం నా కుటుంబం" అని వారికి కొండంత అండగా నిలిచారు.దళారుల ప్రమేయం లేకుండా ప్రజలు నేరుగా నాయకుడిని కలిసేలా ఈ దర్బార్‌ను నిర్వహించారు. ప్రతి వినతికి రసీదు ఇవ్వడంతో పాటు, సమస్య పరిష్కారం అయ్యేదాకా కార్యాలయం నుంచి పర్యవేక్షించేలా పారదర్శక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ.. "అధికారం అలంకారం కాదు, ప్రజల కష్టాలు తీర్చే అవకాశం" అని పేర్కొన్నారు. "ఫైల్‌ని చూడను, మీ కళ్లలోని బాధను చూస్తాను" అంటూ బాధితులకు ఆయన ధైర్యం చెప్పారు. అనకాపల్లి ప్రజల ఆశీర్వాదమే తన బలమని, ఈ గడ్డ మీద ఒక్క సమస్య కూడా మిగలకుండా చూస్తానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల సంక్షేమం లక్ష్యంగా ప్రతి శుక్రవారం ఉదయం 11:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు పార్టీ కార్యాలయంలో ఈ 'ప్రజా దర్బార్' నిరంతరాయంగా కొనసాగుతుందని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనకాపల్లి టీడీపీ కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. కుల, మత, పార్టీలకు అతీతంగా అందరికీ ఈ గ్రీవెన్స్ సెల్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. శ్రీనివాస్ ఏ క్రైమ్ ఎనాలిసిస్,జిల్లా ఇన్చార్జ్.అనకాపల్లి.