పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పరిశీలన.

పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు క్షేత్రస్థాయి పరిశీలన.

14/July/2026 20:32    Share:   

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్ట్ పనులు ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ప్రాజెక్ట్ వ్యూ పాయింటు నుండి ప్రాజెక్ట్ పనులు ప్రగతిని  జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఈసిఆర్ఎఫ్ గ్యాప్, 1, గ్యాప్ 2, పోలవరం  ప్రాజెక్ట్  హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు ( పవరు హౌసు), తదితర ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో ఇంజనీరింగు అధికారులు ప్రాజెక్ట్ పనులు పురోగతిపై ఏర్పాటుచేసిన  ఫోటో ఎగ్జిబిషన్లు  ద్వారా జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు,  జలవనరుల శాఖ సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు లు ముఖ్యమంత్రికి వివరించారు. పర్యటన ఆద్యంతం పనులు పురోగతికి ఇంజనీరింగు అధికారులను చర్యలను ముఖ్యమంత్రి నిశితంగా పరిశీలించి, పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు తీసుకోవలసిన చర్యలను వారి నుండి తెలుసుకుంటూనే, వారికి తగు సూచనలు ముఖ్యమంత్రి అందజేశారు.
ముఖ్యమంత్రి  వెంట రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్,జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, పోలవరం జిల్లా కలెక్టరు కె.దినేష్ కుమార్, ఐజి జి.వి.జి. అశోక్ కుమార్, ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జిల్లా జాయింటు కలెక్టరు ఎం.జె.అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చిర్రి బాలరాజు, చింతమనేని ప్రభాకర్,  మద్దిపాటి వెంకటరాజు, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్, రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీమతి మిర్యాల శిరీషదేవి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ,  పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటరు & ఎక్స్ అఫీషియో జాయింటు కలెక్టరు వి.అభిషేక్, పోలవరం ఇరిగేషన్ యస్ఇ ఆర్.రామచంద్ర రావు,ఏపి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏపి టైకార్ చైర్మన్ బోరగం శ్రీనివాస రావు, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన వాణి శివప్రసాదు, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ, మెగా ప్రతినిధులు, ఇంజనీరింగు బృందం, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter