విజయనగరం జడ్పీ చైర్మన్ పదవికి శ్రీమతి కళా సంధ్య పోటీ..
16/October/2026 19:56
Share:
విజయనగరం విజయనగరం జిల్లా పరిషత్తు జడ్పీ చైర్ పర్సన్ పదవికి సీనియర్ రాజకీయ వేత్త చీపురుపల్లి ఎమ్మెల్యే శ్రీ కిమిడి కళా వెంకట్రావు కోడలు శ్రీమతి సంధ్య పోటీ చేయనున్నారని విశ్వసినీయ సమాచారం. ఆమె టిడిపి యువనేత శ్రీ కిమిడి మల్లిక్ నాయుడు సతీమణి. చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలోని గుర్ల లేదా గరివిడి జడ్పిటిసి గా పోటీ చేయనున్నారు.ఇప్పటికే వైసీపీ తరఫున తన కుమార్తె శ్రీమతి బొత్స అనూష జడ్పీ చైర్మన్ పదవికి పోటీ చేయనున్నారని సీనియర్ నేత శ్రీ బొత్స సత్యనారాయణ ప్రకటించిన విషయం అందరికీ తెలిసినదే రెండున్నరేళ్ల క్రితం జరిగిన సాధారణ ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి కళా, బొత్స పోటీ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో చీపురుపల్లి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించింది.తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జడ్పీ చైర్మన్ పదవికి మళ్లీ ఇద్దరు నేతల తలపడడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. Reporter SAN Raju