ఏలూరు నగర పరిధిలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేస్తాం,,,!
27/May/2026 08:21
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. ఏలూరు నగర పరిధిలో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేయడానికి, నేరాల నియంత్రణ మరియు మహిళల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చే క్రమంలో ఏలూరు వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీ కె. రామకృష్ణ వన్ టౌన్ పీఎస్ పరిధిలోని వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులతో ముఖ్యమైన అవగాహన మరియు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ గారు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ప్రజలకు, పోలీసులకు మధ్య సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు ఒక బలమైన వారధిలా పనిచేయాలని పిలుపు నిచ్చారు.వార్డుల పరిధిలోని ప్రధాన కూడళ్లు, వీధులు, మరియు సమస్యాత్మక ప్రాంతాలలో కొత్తగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను, కాలనీ అసోసియేషన్ల ను చైతన్యపరచాలని సూచించారు.ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని నిరంతరం పర్య వేక్షించాలని, నిఘా పెంచడం ద్వారా దొంగతనాలు, ఆకతా యిల చేష్టలను అరికట్ట వచ్చని తెలిపారు. వార్డులలో నివసించే రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్ల కదలికలపై నిరంతరం ఒక కన్నేసి ఉంచాలని WMSK లను ఆదేశించారు.వారి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు వచ్చినా, లేదా మరలా అసాంఘిక కార్యకలా పాలకు పాల్పడు తున్నట్లు అనుమానం వస్తే వెంటనే ఆ సమా చారాన్ని పోలీస్ స్టేషన్‌కు చేరవేయాలని స్పష్టం చేశారు. వార్డుల పరిధిలోని దేవాలయాలు, చర్చి లు, మసీదులు తదితర ధార్మిక ప్రార్థనా మంది రాల వద్ద భద్రతను సమీక్షించాలి.పూజా స్థలాల వద్ద విధిగా సీసీ కెమెరాలు, రాత్రి వేళల్లో తగిన లైటింగ్ ఏర్పాట్లు ఉండేలా సదరు కమిటీ నిర్వాహకులతో మాట్లాడాలని, విగ్రహాల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.