* సరిహద్దులపై స్పష్టత కరువు..
* 50 నుండి 62 డివిజన్లకు విభజన చేసిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన రెడ్డి అప్పలనాయుడు..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు,
ఏలూరులో డివిజన్ ల విభజనపై గందరగోళం తలెత్తింది.. సరిహద్దులపై స్పష్టత లేదు.. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 50 డివిజన్ లను పెంచుతూ, 50 నుండి 62 డివిజన్లను విభజించి, ఆయా ప్రాంతాలలోని ఏరియా పేర్లు కాకుండా, సర్వే నంబర్లతో బౌండరీలను ఇవ్వడం అనేది సరైన విధానం కాదని ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.. స్థానిక ఇరిగేషన్ అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. ఏలూరు నియోజకవర్గం లోని సాధారణ ప్రజలు, తాము ఏ డివిజన్లో నివసిస్తున్నామో అని కూడా అర్థం కాని విధంగా, సర్వే నంబర్లతో కూడిన డివిజన్ సరిహద్దు ఇవ్వడం వలన సాధారణ ప్రజలకు అర్థం కాని పరిస్థితి తలెత్తిందన్నారు.. ఇతర పార్టీల నుండి పోటీ చేసే అభ్యర్థులకు ఈ సరిహద్దులు అర్థం కాని విధంగా ఉన్నాయని ఆయన మండిపడ్డారు.. మున్సిపల్ అధికారులు తక్షమమే దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సర్వే నంబర్ ప్రదేశంలో డోర్ నెంబర్ గాని, వీధి పేర్లు గాని, కాలనీలోని పేర్లతో బౌండరీలు తయారు చేయాల్సిందిగా రెడ్డి అప్పలనాయుడు కోరారు.. దీనిపై జనసేన పార్టీ ఆధ్వర్యంలో అభ్యంతరం వ్యక్తం చేస్తూ జనసైనికులు, నాయకులు మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు.. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నగర గౌరవ అధ్యక్షులు నగిరెడ్డి కాశి నరేష్, సోషల్ మీడియా ఇంచార్జి జనసేన రవి, నాయకులు జనపరెడ్డి తేజ ప్రవీణ్, పైడి లక్ష్మణరావు, నూకల సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు..