ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు: జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్,

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు: జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్,

31/August/2026 19:54    Share:   

ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట బందోబస్తు: జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఐఏఎస్ & జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ 
పోలవరం ఎడమ కాలువ 'జలహారతి' కార్యక్రమంలో పాల్గొననున్న గౌరవ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) పూర్తి 
1600 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు 
అనకాపల్లి (పాయకరావుపేట)
ఆగస్టు 31:
పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటి విడుదల సందర్భంగా నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘జలహారతి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 2న అనకాపల్లి జిల్లా, పాయకరావుపేటలో పర్యటించనున్నారు.
​ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సోమవారం జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్, ఐఏఎస్, జాయింట్ కలెక్టర్ శ్రీ శౌర్య మాన్ పటేల్, ఐఏఎస్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పర్యటన ప్రాంతాలలో క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ASL) నిర్వహించి, భద్రతా ఏర్పాట్లను సమగ్రంగా సమీక్షించారు.​ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటనను అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.1600 మందితో పకడ్బందీ భద్రత: ముఖ్యమంత్రి పర్యటన నిమిత్తం సుమారు 1600 మంది సిబ్బందితో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.భద్రతా సిబ్బంది కేటాయింపు: 03 అదనపు ఎస్పీలు, 09 డీఎస్పీలు, 36 సీఐలు, 90 ఎస్ఐలు, 150 ఏఎస్ఐ/హెడ్ కానిస్టేబుళ్లు, 427 మంది కానిస్టేబుళ్లు, 150 మంది మహిళా కానిస్టేబుళ్లు మరియు 249 మంది హోంగార్డులు విధుల్లో పాల్గొంటారు.
ప్రత్యేక రక్షణ విభాగాలు: రోప్ పార్టీలు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్, డాగ్ స్క్వాడ్ మరియు స్పెషల్ పార్టీ బలగాలను మోహరిస్తున్నారు.
​పర్యటన షెడ్యూల్:
పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి హెలిప్యాడ్ వద్దకు చేరుకుని, అనంతరం పోలవరం ఎడమ కాలువ వద్ద జలహారతి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం బహిరంగ సభ, పార్టీ కార్యకర్తల సమావేశం మరియు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
అధికారులకు ఆదేశాలు: 
"విధుల పట్ల ఎలాంటి అలసత్వం వహించకుండా క్షేత్రస్థాయి అధికారులంతా పరస్పర సమన్వయంతో పనిచేయాలి. హెలిప్యాడ్, సభా ప్రాంగణాలు, ముఖ్య మార్గాల్లో నిరంతరం తనిఖీలు చేపట్టాలి. బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు పూర్తి అప్రమత్తంగా ఉండి, పర్యటన ముగిసేవరకు నిరంతర నిఘా కొనసాగించాలి" అని జిల్లా ఎస్పీ ఆదేశించారు.
​ASL సమీక్షా సమావేశంలో పాల్గొన్న అధికారులు: 
ఈ భద్రతా సమీక్షలో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ (SSG) అడిషనల్ డైరెక్టర్ శ్రీ కె.శ్రీనివాస రావు, అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహన రావు, ఆర్డీవోలు శ్రీమతి కె.వి.రామలక్ష్మి, శ్రీ వీ.వీ.రమణ, నర్సీపట్నం డీఎస్పీ శ్రీ పి.శ్రీనివాసరావు, పరవాడ ఇన్చార్జి డీఎస్పీ శ్రీ బి.మోహన రావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ ఈ.శ్రీనివాసులు, ఆర్మ్డ్ రిజర్వ్ డీఎస్పీ శ్రీ కె.రవికుమార్, ఇతర డీఎస్పీలు, సీఐలు బాల సూర్యారావు, వినోద్ బాబు, గఫూర్, వెంకటనారాయణ, ధనుంజయ రావు, అశోక్ కుమార్, ఎస్సైలు పురుషోత్తం, అలీ షరీఫ్ తదితర జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter