జీతాల పెంపు కోసం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల భారీ ఆందోళన ..

జీతాల పెంపు కోసం అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల భారీ ఆందోళన ..

10/July/2026 17:13    Share:   

అనకాపల్లి: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనం రూ.26,000 అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శుక్రవారం అనకాపల్లిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌లోని సీఐటీయూ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ నెహ్రూ చౌక్ మీదుగా ఎన్టీఆర్ స్టేడియం వరకు కొనసాగింది. నెహ్రూ చౌక్ నాలుగు రోడ్ల కూడలిలో అంగన్వాడీ కార్యకర్తలు మానవహారం నిర్వహించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జీతాల పెంపుపై ప్రకటన చేయాలని నినదించారు.ఎన్టీఆర్ స్టేడియంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు దుర్గారాణి అధ్యక్షతన నిర్వహించిన సభలో రాష్ట్ర సీఐటీయూ అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మజ్జి నాగ శేషు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శంకర్రావు మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులపై ప్రభుత్వం రోజురోజుకూ పనిభారం పెంచుతోందని విమర్శించారు.వక్తలు మాట్లాడుతూ ఐసీడీఎస్ లక్ష్యాలకు విరుద్ధంగా పోషణ ట్రాకర్, బాలసంజీవిని, PMMVY, స్క్రీనింగ్ డేటా వంటి అనేక యాప్‌లు, ఆన్‌లైన్ పనులను అంగన్వాడీ ఉద్యోగులతో చేయిస్తున్నారని తెలిపారు.దీంతో ప్రీ-స్కూల్ బోధనకు ఆటంకం కలుగుతోందని,సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు చేసే స్థాయి పనులను అతి తక్కువ వేతనాలతో అంగన్వాడీలపై మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం అంగన్వాడీ వర్కర్లకు రూ.11,500,హెల్పర్లు, మినీ వర్కర్లకు రూ.7,000 మాత్రమే వేతనం అందుతోందని ఆవేదన వ్యక్తం చేసారు..
Breaking News

Subscribe our Newsletter