కరువు నివారణ చర్యలపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి..!
22/May/2026 19:30
Share:
కరువు నివారణ చర్యలపై ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలి..!రాంబిల్లి ఎమ్మార్వో పి. సత్యనారాయణ..!! క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ - ఉత్తరాంద్ర జోనల్ ఇంచార్జ్ : ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరువు నివారణ చర్యలు చేపట్టేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించాలని రాంబిల్లి ఎమ్మార్వో పి. సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో కరువు నివారణ చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భవిష్యత్తులో కరువు పరిస్థితులు ఎదురైతే తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖలు ముందస్తుగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.వ్యవసాయం, పశుసంవర్ధక, త్రాగునీటి సరఫరా, నీటిపారుదల, పంచాయతీరాజ్, సివిల్ సప్లై, వైద్య ఆరోగ్య, ఉపాధి హామీ (NREGS) శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తంగా ఉండి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో ఎంపీడీవో ఎన్. జయమాధవి, ఎంఏవో సి. సుమంత్, ఈఓపీఆర్&ఆర్డీ బి.వి.యస్. రాజు తదితరులతో పాటు వెటర్నరీ, ఉపాధి హామీ, ఇరిగేషన్, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు పాల్గొన్నారు.