నీట్ పరీక్షా లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి.ఏఐఎస్ఎఫ్,

నీట్ పరీక్షా లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి.ఏఐఎస్ఎఫ్,

05/June/2026 17:12    Share:   

ఏఐఎస్ఎఫ్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి. శివకుమార్ ఎన్ టి ఏ ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలి.

కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు 
నీట్ పరీక్ష లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ డిమాండ్ చేశారు.శుక్రవారం స్థానిక ఏలూరు లో ఉన్న ధర్నా చౌక్ లో ఏఐఎస్ఎఫ్  ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి. శివకుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మే 4వ తేదీన జరిగినటువంటి నీట్ ప్రవేశ పరీక్షలలో 20 లక్షలకు పైగా వ్రాశారని,నాడు పేపర్ లీకేజ్ జరిగిందని పరీక్షను రద్దు చేయడం జరిగిందన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు.దేశవ్యాప్తంగా పేద మధ్య తరగతి విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని మండిపడ్డారు. 22 లక్షల మంది  విద్యార్థులకు పైగా ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యను పూర్తి చేసుకొని నీట్ ప్రవేశ పరీక్ష కు సిద్ధమై పరీక్ష రాస్తే ఇప్పుడు పరీక్ష పేపర్ లీకేజ్ అయిందని నీటి పరీక్షను రద్దు చేయడం జరిగిందన్నారు..విద్యార్థుల సమయాన్ని కేంద్ర ప్రభుత్వం వృధా చేయడమే కాకుండా వాళ్ళ ఆశలను అడియాసలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత సంవత్సరం కూడా ఇదే తరహాలో హర్యానా బీహార్ రాష్ట్రాలలో నీట్ పరీక్ష పేపర్ ను రూ.30 లక్షల నుంచి 50 లక్షల వరకు అమ్ముకొని లీకేజ్ చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేపర్ ను లీకేజ్ జరిగిందన్నారు.  ఎన్ టి ఏ ఏజెన్సీ ద్వారా నీటి ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తుందని, ఇప్పటికే రెండుసార్లు లీకేజ్ కావడం కేంద్ర ప్రభుత్వం నీటి ప్రవేశ పరీక్ష పైన ఎంత చిత్తశుద్ధి ఉందో తేట తెల్లం అయిందన్నారు.  గతంలో ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాలలో నీటి ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేసేవారని, ఆ సందర్భంలో ఎప్పుడూ కూడా నీట్ ప్రవేశ పరీక్షకు సంబంధించిన పేపరు లీకేజ్ జరిగ లేదన్నారు.  కేంద్ర విద్యా శాఖ నిర్లక్ష్యం వల్లనే ఇలా రెండు సంవత్సరాల లో పేపర్ లీకేజ్ కావడం జరిగిందని తెలిపారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్ టి ఏ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏలూరు జిల్లా నాయకులు సిద్దు,నగర నాయకులు, ఆకాష్,నరేంద్ర, పృద్వి,మురళి, విజయ్,మణికంఠ,మున్నా, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter