విశాఖపట్నంలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 : 59 దేశాల నుంచి ప్రతినిధులు

విశాఖపట్నంలో CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 : 59 దేశాల నుంచి ప్రతినిధులు

08/November/2026 21:11    Share:   

విశాఖపట్నం / అమరావతి, 

విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీల్లో 31వ CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 జరగనుంది. ఈ రెండు రోజుల అంతర్జాతీయ సదస్సుకు 59 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు.

‘నావిగేటింగ్ న్యూ వరల్డ్ ఆర్డర్ : ట్రేడ్, టెక్నాలజీ, ట్రస్ట్’ అనే ఇతివృత్తంతో జరిగే ఈ సమ్మిట్‌కు సుమారు 1,250 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరిలో 350 మంది విదేశీ ప్రతినిధులు, 900 మంది భారత ప్రతినిధులు, 40కి పైగా అంతర్జాతీయ వక్తలు ఉండనున్నారు. 15 దేశాల విదేశాంగ మంత్రులు కూడా పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రాన్ని ప్రపంచ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యం, సాంకేతిక భాగస్వామ్యాలకు కేంద్రంగా నిలపడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది.

శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు, చర్చాంశాలు, ముసాయిదా ప్రకటనపై అధికారులు, CII డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో సమీక్ష నిర్వహించారు.

ఈ సదస్సులో విధానకర్తలు, పెట్టుబడిదారులు, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు భాగస్వాములు కానున్నాయి. సుమారు 400 బిజినెస్-టు-బిజినెస్ (B2B), బిజినెస్-టు-గవర్నమెంట్ (B2G) సమావేశాలు నిర్వహించనున్నారు.

Breaking News

Subscribe our Newsletter