
క్రైమ్ ఎనాలసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్ ఏ
అనకాపల్లి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఎమ్మెల్యే శ్రీ కొణతాల రామకృష్ణ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అనకాపల్లి ఆర్డీవో, మున్సిపల్ మరియు రెవెన్యూ శాఖ అధికారులతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వ పథకాల అమలు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.ముఖ్యంగా రహదారులు,డ్రైనేజీ,తాగునీటి సరఫరా,రెవెన్యూ సమస్యలు,పట్టణ అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.అనకాపల్లి పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు తెలిపారు.ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే విధంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సందర్భంగా అధికారులు అభివృద్ధి పనుల పురోగతిని ఎమ్మెల్యేకు వివరించగా,ప్రజలకు ఉపయోగపడే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు.