యలమంచిలి లో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా.
07/April/2026 06:42
Share:
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి : యలమంచిలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి అధ్యక్షుడు అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఎగురవేసి, మిఠాయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ సభ్యురాలు పిళ్లా రమాకుమారి, అనకాపల్లి జిల్లా బీజేపీ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షురాలు సయ్యద్ బీబీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సభ్యులు పిట్టా దాసుబాబు, పట్టణ అధ్యక్షుడు బొద్ధపు శివ పాల్గొన్నారు.అలాగే నాయకులు మళ్ల కొండ బాబు, కర్రి జానకిరామ్, చెక్కా శ్యామ్, పీలా ధనలక్ష్మి, ఇత్తడి రాణి, ఆడారి భాస్కర్, వేగి శ్రీను, పప్పు ఈశ్వరావు, అత్తిలి నూకరాజు, బొడ్డేటి సురేష్, జగ్గుమంత్రి, సతీష్, బీ విశ్వనాధరాజు, సుందరపు బాబ్జి, ఆడారి వెంకట్ తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.