కేజీహెచ్‌ సమాచార నిధిపై

కేజీహెచ్‌ సమాచార నిధిపై 'సి.సి.ఆర్. ఎన్‌జీఓ' ఆర్‌టీఐ అస్త్రం!

05/June/2026 17:07    Share:   

క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్ :
వైజాగ్ కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో నిధుల వినియోగం, సిబ్బంది కొరత, ఖాళీ పోస్టులు, ఫిర్యాదులు, ఔషధాల కొనుగోలు, రోగుల సేవలు మరియు అభివృద్ధి పనులపై సమగ్ర సమాచారాన్ని కోరుతూ కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సి.సి.ఆర్. ఎన్‌జీఓ) సమాచార హక్కు చట్టం–2005 కింద ప్రజా సమాచార అధికారికి ఆర్‌టీఐ దరఖాస్తు సమర్పించింది.
గత ఐదేళ్లలో ఆసుపత్రి అభివృద్ధి సంఘం (హెచ్‌డీఎస్), కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్), రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి అందిన నిధులు, వాటి వినియోగ వివరాలు, వైద్యులు, నర్సులు, సాంకేతిక సిబ్బంది, అవుట్‌ సోర్సింగ్ ఉద్యోగుల మంజూరైన పోస్టులు, ఖాళీలు, నియామకాల వివరాలు కోరినట్లు సి.సి.ఆర్. ఎన్‌జీఓ ప్రతినిధులు తెలిపారు.
అదేవిధంగా రోగులు, ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలు, వైద్య సేవల నాణ్యత, పరిశుభ్రత, రోగుల సంక్షేమం, ఔషధాల నిల్వ, పంపిణీ, ఓపీ – ఐపీ సేవల గణాంకాలు తదితర అంశాలపై కూడా సమాచారం కోరారు.
ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ. వాణిని మర్యాదపూర్వకంగా కలిసి ఆర్‌టీఐ దరఖాస్తును అందజేశారు. ప్రజా ప్రయోజన అంశాలపై సి.సి.ఆర్. ఎన్‌జీఓ చేస్తున్న కృషిని ఆమె అభినందించినట్లు తెలిపారు.
సి.సి.ఆర్. ఎన్‌జీఓ ఉత్తరాంధ్ర జిల్లాల ఇంచార్జ్ కర్రోతు రాము మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం చట్టబద్ధ మార్గాల్లో నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాళ్ల అప్పలరాజు, టివియస్ ప్రకాష్, బలివాడ కన్నబాబు, ఆంగటి పైడిరాజు, నాగల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంస్థ నూతన సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేసి, ఆర్‌టీఐ.
Breaking News

Subscribe our Newsletter