యలమంచిలి పేట బయ్యవరం పాఠశాలలో ఏకరూప దుస్తులు, బూట్లు పంపిణీ ..
06/July/2026 21:51
Share:
ఎంపీపీ రాజాన శేషగిరి చేతుల మీదగా పేట బయ్యవరం పాఠశాలలో ఏకరూప దుస్తులు, బూట్లు పంపిణీ .. యలమంచిలి,పేట బయ్యవరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు బొడ్డెడ. సత్యనారాయణ అధ్యక్షతన తల్లిదండ్రుల సమావేశం నిర్వహించడమైనది. ముఖ్య అతిథులుగా మండల అధ్యక్షులు రాజాన శేషగిరి (శేషు ) విచ్చేసి పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా కిట్స్ కు సంబంధించిన ఏక రూప దుస్తులు, బూట్లను పిల్లలకి అందజేయడమైనది. ఇతను మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం విద్యా రంగానికి ఎక్కువ నిధులు కేటాయించడమైనదని,11,12,13 తేదీలులో తల్లికి వందనం నిధులు వేయడం జరుగుతుందని అందువల్ల మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయవలసిందిగా తల్లిదండ్రులును కోరడమైనది. పిల్లలు ఎక్కువ మంది చేర్చినట్లయితే ఉన్నత పాఠశాల అవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సానా. నాని, మొగ్గ. అప్పారావు, ఎద్దు. చిట్టి బాబు, చంద్రగిరి నాని,కరిపి రెడ్డి. జోగారావు, ఊటకోటి వెంకటరావు, ఎడ్ల. సోమేష్, ఉపాధ్యాయులు కె. వీరభద్ర రావు,కె. శోభా రాణి,కె. గౌతమి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.