సిస్టమ్ కంటే మనసాక్షి గొప్పదని నిరూపించిన మహిళ – హెడ్ కానిస్టేబుల్ రేవతి
క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్, యలమంచిలి
సత్తనకులం కస్టడయల్ డెత్ కేసు దేశాన్ని కుదిపేసిన ఘటన. ఆ ఘటనలో నిజం వెలుగులోకి రావడానికి కారణమైన పేరు ఒక్కటే — రేవతి.
- పోలీస్ స్టేషన్‌లో పరిస్థితి —
- “జరిగినది బయటికి రాకూడదు.”
- సాక్ష్యాలు తుడిచేయాలి… కథ మార్చాలి… ఒత్తిడి పెంచాలి…
ఇలాంటి సమయంలో చాలా మంది మౌనం వహిస్తారు. కానీ రేవతి మాత్రం మౌనం ఎంచుకోలేదు.ఆమెకి ఇది కేవలం డ్యూటీ కాదు… తన కళ్ల ముందే జరిగిన దారుణానికి న్యాయం చేయాల్సిన బాధ్యత.మేజిస్ట్రేట్ ముందు ఆమె చెప్పిన ప్రతి మాట — కేసు దిశనే మార్చింది. స్టేషన్‌లో శుభ్రం చేసినప్పటికీ గోడల మూలల్లో, టేబుళ్ల కింద మిగిలిన రక్తపు మరకలను గుర్తించి చూపింది. అదే రక్తపు చుక్కలు… నేరాన్ని నిరూపించాయి.సీసీటీవీ లేకపోయినా… తన జ్ఞాపకాలతో సంఘటనల టైమ్‌లైన్‌ను స్పష్టంగా వివరించింది.అదే వ్యవస్థలో ఉండి… అదే వ్యవస్థకు వ్యతిరేకంగా నిజం చెప్పడం — అది ఒక అసాధారణ ధైర్యం.ఈ కేసులో న్యాయం జరగడానికి కారణాలు చాలానే ఉండొచ్చు… కానీ నిజం బయటికి రావడానికి కారణమైన పేరు మాత్రం ఒక్కటే —
రేవతి.బాధితులు ప్రాణాలు కోల్పోయినా… నిజాన్ని బ్రతికించిన పేరు మాత్రం ఒక్కటే —
రేవతి.