ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ లో 7910 కేసుల పరిష్కారం.
13/July/2026 20:15
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి వెల్లడి ... జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ అమరావతి మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి శ్రీ జస్టిస్ కె.శ్రీనివాస రెడ్డి ఆదేశానుసారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏలూరు వారి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈనెల 11వ తేదీన నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు జిల్లా వ్యాప్తంగా 36 బెంచీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో ఏలూరు లో 10 బెంచీలు, భీమవరం 5, కొవ్వూరు 2 నరసాపురం 4, తణుకు 5 తాడేపల్లిగూడెం 3, పాలకొల్లు 2, నిడదవోలు 1, జంగారెడ్డిగూడెం 2, చింతలపూడి 1 మరియు భీమడోలు 1 చొప్పున బెంచీలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన శ్రీమతిగా యస్.శ్రీదేవి తెలియజేశారు. జాతీయ లోక్ అదాలత్ నందు జిల్లావ్యాప్తంగా 7857 పెండింగు కేసులు 53 ప్రీ లిటిగేషన్ కేసులుగా రాజీ చేయడం జరిగిందని, పెండింగు కేసులలో 7454 క్రిమినల్ కేసులు,185 మోటార్ వాహన ప్రమాద భీమా కేసులు, 215 సివిల్ కేసులను రాజీ చేయడం జరిగిందని అన్నారు. వీటితోపాటుగా 53 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారించ బడ్డాయని తెలిపారు. వీటిలో ఏలూరు 2328, భీమవరం 478, చింతలపూడి 404 జంగారెడ్డిగూడెం 906 కొవ్వూరు 756,నర్సాపురం 335 పాలకొల్లు 448, తాడేపల్లిగూడెం 711, తణుకు 1197 నిడదవోలు 228 మరియు భీమడోలు 66 కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్ నందు పరిష్కరించామని తెలిపారు.ఈ జాతీయ లోక్ అదాలత్ నందు కేసులు పరిష్కారానికి తోడ్పడిన న్యాయవాదులకు, పోలీసు అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, ఇన్సూరెన్స్ అధికారులకు, బ్యాంకు అధికారులకు, చిట్ ఫండ్ ప్రతినిధులకు, లేబరు డిపార్ట్మెంటు అధికారులకు, మున్సిపల్ సిబ్బందికి, బిఎస్ఎన్ఎల్ వారికి, జిల్లా పంచాయతీ శాఖ వారికి, పత్రిక విలేకరులకు, రవాణాశాఖ అధికారులకు, ఎక్సైజ్ అధికారులకు, రైల్వే శాఖ అధికారులకు, అడ్వకేటు గుమస్తాలకు, అగ్రికల్చరల్ అధికారులకు మరియు మిగతా శాఖల అందరికీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్- కం-జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి యస్.శ్రీదేవి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ-కం- సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి యన్. శ్రీలక్ష్మి కృతజ్ఞతలు తెలియజేశారు.