దర్జీ నగర్ శ్రీ సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

దర్జీ నగర్ శ్రీ సాయిబాబా ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు.

29/July/2026 19:36    Share:   

అనకాపల్లి( ప్రకృతి న్యూస్ )
అనకాపల్లి మండలం బవులు వాడ దరి దర్జీ నగర్ లో వేంచేసిన శ్రీ షిరిడి సాయి బాబా ఆలయంలో బుధవారం గురుపౌర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. అనకాపల్లి మండలంలోని తుమ్మపాల మామిడిపాలెం మార్టూరు మాకవరం పాపయ్యపాలెం పాపయ్య సంతపాలెం చోడవరం మండలం వెంకన్నపాలెం దుడ్డుపాలెం తదితరు గ్రామాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ శిరిడి సాయి బాబాకు భక్తి ప్రపత్తులతో పూజా దికాలు నిర్వహించారు. ఇటీవల కాలంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాన్ని దర్శించి అనకాపల్లి నుంచి కూడా వందలాది మంది భక్తులు ఇక్కడికి విచ్చేసి శ్రీ సాయిబాబాకు పూజలునిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వ్యవస్థాపకులు మజ్జి అర్జున్ రావు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కమిటీ గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
Breaking News

Subscribe our Newsletter