ఏలూరు జిల్లా మాలమహానాడు నూతన కార్యవర్గం ఎన్నిక, అధ్యక్షులుగా బోరుగడ్డ కిషోర్

ఏలూరు జిల్లా మాలమహానాడు నూతన కార్యవర్గం ఎన్నిక, అధ్యక్షులుగా బోరుగడ్డ కిషోర్

21/July/2026 13:19    Share:   

ఏలూరు జిల్లా మాలమహానాడు సమావేశం.1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రద్దు చేయాలి - మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ డిమాండ్.ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు 100% దళితులకే ఖర్చు పెట్టాలని పిలుపు. 
 
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,ఏలూరు, 

ఏలూరు నగరంలోని లేడీస్ క్లబ్‌లో ఆదివారం మాలమహానాడు ఏలూరు జిల్లా సమావేశం ఘనంగా జరిగింది.ఈ సమావేశానికి మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
సమావేశం ప్రారంభంలో ఇటీవల మరణించిన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కి నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని నల్లి రాజేష్ మండిపడ్డారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ను వెంటనే రద్దు చేయాలి. మతం మారినంత మాత్రాన దళితులకు రావాల్సిన రిజర్వేషన్లు, హక్కులు కాదనడం సరికాదు" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఏ ప్రభుత్వం వచ్చినా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారని నల్లి రాజేష్ విమర్శించారు. సబ్ ప్లాన్ నిధులు 100 శాతం ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికే ఖర్చు పెట్టాలి. దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు.రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. "దళితులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి" అని పేర్కొన్నారు.
ఏలూరు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక ఈ సమావేశంలో ఏలూరు జిల్లా మాలమహానాడు నూతన కార్యవర్గాన్ని నాయకులు ఎన్నుకున్నారు. మాల మహానాడు ఏలూరు జిల్లా అధ్యక్షులుగా బోరుగడ్డ కిషోర్  ను, రాష్ట్ర యువజన ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సుంకర రాజేష్ ను, జిల్లా యువజన అధ్యక్షులుగా రామాల ఆనంద్ ను, రాష్ట్ర కార్యదర్శిగా పీతల కృష్ణ మూర్తి, ఏలూరు మండల అధ్యక్షులుగా జంగం వెంకటరత్నం ఎన్నుకున్నారు... జిల్లాలో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, దళితుల సమస్యలపై పోరాడతామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో  మాల మహాసేన అధ్యక్షుడు అలగ రవికుమార్, గుండే నగేష్, తొర్లపాటి శ్రీనివాస్, విప్పర్తి ప్రభాకర్, రొక్కాల నాగరాజు, వెంపల రాజు, సింగవరపు మనోజ్, మర్రే సామ్యూల్  జిల్లా నలుమూలల నుంచి పలువురు మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter