అనకాపల్లి బెల్లం మార్కెట్ రైతు బజార్‌లో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలు !

అనకాపల్లి బెల్లం మార్కెట్ రైతు బజార్‌లో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాలు !

03/August/2026 18:50    Share:   

మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ,అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ్ కృష్ణన్ , జాయింట్ కలెక్టర్ శ్రీ శౌర్య పటేల్,కలిసి అనకాపల్లి రింగ్ రోడ్డులోని ఎన్‌టీఆర్ బెల్లం మార్కెట్ ప్రాంగణంలోని రైతు బజార్‌లో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు రాష్ట్ర రైస్ మిల్లర్ల సహకారంతో బీపీటీ స్టీమ్ సన్న బియ్యాన్ని కిలోకు రూ.52కే అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే త్వరలో మరో రకం బీపీటీ సన్న బియ్యాన్ని కిలోకు రూ.60 ధరకు అందించనున్నట్లు తెలిపారు. ప్రతి అర్హ కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  మాజీ ఎమ్మెల్సీ శ్రీ బుద్ధ నాగ జగదీష్ గారు, గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర గారు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ కోట్ని బాలాజీ గారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ ద్వారపురెడ్డి పరమేశ్వరరావు గారు, సివిల్ సప్లై అధికారులు మరియు కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా శ్రీ కొణతాల రామకృష్ణ గారు మాట్లాడుతూ, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బియ్యం కొనుగోలు చేయడానికి వచ్చే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. కేంద్రంలో వారి వివరాలను నమోదు చేసి బియ్యాన్ని అందజేస్తారని తెలిపారు. ఈ కేంద్రం రాష్ట్ర రైస్ మిల్లర్స్ సంఘం సహకారంతో, సివిల్ సప్లైస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోందని, ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో బీపీటీ సన్న బియ్యం ధర కిలోకు రూ.65 నుంచి రూ.67 వరకు ఉండగా, ప్రభుత్వం అదే బియ్యాన్ని రూ.52కే అందిస్తున్నందున, ఒక కుటుంబం నెలకు 10 కిలోలు కొనుగోలు చేస్తే రూ.130 నుంచి రూ.150 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించి వారికి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.అలాగే రైతు బజారులో రైతులు, వ్యాపారులు, హోల్‌సేల్ వ్యాపారులు సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన వస్తువులు అందించేందుకు సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Breaking News

Subscribe our Newsletter