బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా దిగుమర్తి ఈశ్వరరావు నియామకం..!
26/March/2026 07:24
Share:
యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పార్టీ బలోపేతం, ఎస్సీ వర్గాల అభివృద్ధి కోసం ఈశ్వరరావు కృషి చేస్తారని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. క్రైమ్ అనాల్సిస్ టీవీఎస్ ప్రకాష్ (సోషల్ మీడియా ఇంచార్జ్), యలమంచిలి : యలమంచిలి పట్టణ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎస్సీ మోర్చా అధ్యక్షునిగా దిగుమర్తి ఈశ్వరరావు నియమితులయ్యారు. యలమంచిలి అర్బన్ ప్రాంతానికి చెందిన ఆయనకు ఈ బాధ్యతలను అప్పగిస్తూ అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గొటివాడ సామ్రాట్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.