సింహాచలం చందనోత్సవం: టికెట్ల జారీలో గందరగోళం.. భక్తుల తీవ్ర నిరాశ
14/April/2026 16:15
Share:
సింహాచలం: అప్పన్న స్వామి నిజరూప దర్శన భాగ్యం కల్పించే చందనోత్సవ టికెట్ల విక్రయాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. టికెట్ల జారీ ప్రక్రియపై భక్తులు దేవస్థానం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
బ్యాంకుల వద్ద బారులు తీరిన భక్తులు: టికెట్ల కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు సింహాచలంలోని ఎస్‌బిఐ (SBI), యూనియన్ బ్యాంకుల వద్ద వేల సంఖ్యలో క్యూ కట్టారు. అయితే, గంటల తరబడి వేచి ఉన్నా టికెట్లు దొరక్కపోవడంతో భక్తుల్లో అసహనం పెరిగిపోయింది. ఈ క్రమంలో బ్యాంకుల వద్ద తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది అరకొరగా టికెట్ల విక్రయం: దేవస్థానం అధికారులు టికెట్లను అత్యంత పరిమితంగా, అరకొరగా విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. వేల మంది భక్తులు తరలివస్తే, కేవలం కొద్దిమందికి మాత్రమే టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా లైన్లలో నిలబడిన తమకు చివరకు నిరాశే మిగిలిందని సామాన్య భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల సమన్వయ లోపం వల్లే ఏటా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పటికైనా స్పందించి దర్శన టికెట్ల పంపిణీని క్రమబద్ధీకరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.