ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ నూరు శాతం పూర్తి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ
19/July/2026 20:28
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి ఏలూరు, ఏలూరు,జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారంల డిజిటైజేషన్ నూరుశాతం పూర్తి అయిందని, నిర్ణీత సమయంలోగానే లక్ష్యాన్ని సాధించిన ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లను జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ అభినందించారు. స్థానిక కలెక్టరేట్ నుండి ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) 2026 కార్యక్రమం ప్రగతిపై ఈఆర్ఓ లు, ఏ ఈఆర్ఓ లతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ 16 లక్షల 44 వేల 193 మంది ఓటర్లకు నూరుశాతం ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని, వాటిని వివరాలు నమోదు అనంతర ఓటర్ల నుండి తీసుకుని బిఎల్ఓ లు నూరుశాతం డిజిటైజేషన్ చేశారన్నారు. జిల్లాలో 4256 ఓటర్ల వివరాలను మాపింగ్ చేయవలసి ఉందని, చింతలపూడి, కైకలూరు, ఏలూరు నగరం, పెదవేగి, ఉంగుటూరు, కొయ్యలగూడెం, చాట్రాయి మండలాలలో అధికంగా పెండింగ్ ఉందని, అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆదివారం మధ్యాహ్నం నాటికి మాపింగ్ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో డెత్, షిఫ్టింగ్, శాశ్వత వలసదారులకు సంబందించి వాటిపై వివరాలు సేకరించి వెంటనే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిఆర్ఓ ఎం. శ్రీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీఓ లు లక్ష్మీప్రసన్న, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ ఏ . భానుప్రతాప్, స్వర్ణ గ్రామ/వార్డ్ సచివాలయాలు ప్రత్యేక అధికారి నాయుడు, ఈఆర్ఓ లు, ఏఈఆర్ఓ లు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, బిఎల్ఓలు, ప్రభృతులు పాల్గొన్నారు.