వెదురువాడ, మార్టూరు దళితపేటలో సమస్యలు పరిష్కరించాలి, ప్రజా సంఘాలు

వెదురువాడ, మార్టూరు దళితపేటలో సమస్యలు పరిష్కరించాలి, ప్రజా సంఘాలు

06/August/2026 06:20    Share:   

రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై వివక్షత, సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంఘాలు సర్వేలకు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా వెదురువాడ, మార్టూరు గ్రామాల్లో, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము, మండల కన్వీనర్ కే సోము నాయుడు పర్యటన చేయడం జరిగింది. గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై దళితులు వివరించడం జరిగింది. ఎదురు వాడ సర్వే నెంబర్ 1 లో ఒక్కొక్కరికి ఎకరం చొప్పున రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం భూములు ఇచ్చారని వాటిలో జీడి మామిడి మొక్కలు పెంచుకొని ఉపాధి పొందేవారమని వాటిలో జగనన్న కాలనీ, ఏపీఐఐసీ వారు తీసుకొని నేటికీ నష్టపరిహారం ఇవ్వలేదని, రేషన్ డిపో లేక నాలుగు కిలోమీటర్లు వెళ్లి  రావడం వృద్ధులు కు ఇబ్బందిగా ఉందని నెలలో ఒకరోజు దళిత కాలనీలో రేషన్ పంపిణీ చేయాలని తెలిపారు ,మార్టూరు గ్రామము లో భూములు బ్రాండ్ ఎక్స్ ,ఎకోమా టైర్ల కంపెనీలో భూములు కోల్పోయి ఉపాధి కోల్పోయామని స్థానిక పరిశ్రమల్లో నిర్వాసితులకు ఉపాధి కల్పించడం లేదని , పింఛన్లు,  స్కీము ఇల్లు మంజూరు చేయాలని ,ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు గ్రామానికి ఖర్చు చేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని తెలిపారు  ఈ కార్యక్రమంలో మైలపల్లి శ్రీనివాసు ,అల్లంపల్లి అప్పారావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter