కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు
ఇటీవల కాలంలో QVSE అనే అప్లికేషన్ ద్వారా ఏలూరు జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలను మోసం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది.
ఈ అప్లికేషన్లో డబ్బులు పెట్టుబడిగా పెడితే నెలకు ₹600 వడ్డీ ఇస్తామని, డాలర్లలో పెట్టుబడి పెడతామని, డాలర్లను రూపాయల్లోకి కన్వర్ట్ చేస్తామని, రోజువారీగా వడ్డీ చెల్లిస్తామని ప్రజలను నమ్మిస్తున్నారు.
మీరు పెట్టుబడి పెట్టినట్లు వారి వెబ్సైట్లో చూపిస్తారు. కానీ వాస్తవంగా ఆ డబ్బు మీ చేతికి అందదు.
ఇలాంటి చైన్-లింక్ స్కామ్లలో కొత్త వ్యక్తులు పెట్టే డబ్బును ఉపయోగించి, గతంలో పెట్టుబడి పెట్టిన వారికి కొంతకాలం డబ్బులు చెల్లిస్తూ నమ్మకం కలిగిస్తారు. ఇలా కొత్త వ్యక్తులను చేర్చుకుంటూ వెళ్తారు. ఒక దశలో కొత్తగా డబ్బులు రావడం ఆగిపోయినప్పుడు, అంటే లిక్విడిటీ తగ్గినప్పుడు, ఒక్కసారిగా మొత్తం వ్యవస్థను మూసివేసి మోసం చేసి వెళ్లిపోతారు.
కాబట్టి ప్రజలందరూ ఇలాంటి అప్లికేషన్లకు దూరంగా ఉండండి.
ఎవరూ మీకు ఊరికే డబ్బులు ఇవ్వరు. రోజువారీ వడ్డీ వస్తుందని, డాలర్లలో పెట్టుబడి పెడతామని, క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెడతామని చెప్పే ఇలాంటి ఆకర్షణీయమైన హామీలను నమ్మవద్దు.
రకరకాల అబద్ధాలు చెబుతూ మిమ్మల్ని పెట్టుబడి పెట్టేలా చేసే ఇలాంటి అప్లికేషన్ల గురించి ఎవరైనా చెప్పినా నమ్మవద్దు.
ఎవరైనా ఇలాంటి మోసానికి గురైనట్లయితే వెంటనే ఏలూరు పోలీస్ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయండి. సైబర్ మోసానికి గురైతే 1930కు కాల్ చేయండి. అత్యవసర పరిస్థితుల్లో 112కు సమాచారం ఇవ్వండి.