అచ్చుతాపురం "రైతు సంఘం మహాసభ". రైతు సమస్యలు పరిష్కరించాలి,

అచ్చుతాపురం "రైతు సంఘం మహాసభ". రైతు సమస్యలు పరిష్కరించాలి,

16/March/2026 19:16    Share:   

రైతు సమస్యలు పరిష్కరించాలి,
నాగ శ్రీనువాస్/ రిపోర్టర్ CA NEWS యలమంచిలి
రైతుల సమస్యల పరిష్కరించాలని అచ్చుతాపురం మండల ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల మహాసభ తిమ్మ రాజుపేట గ్రామంలో భీముని వెంకటేశ్వరరావు కాండ్రేగుల రామ సదాశివరావు అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ఇటీవల రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజు పై ప్రభుత్వం పీడీ యాక్ట్ పెట్టి 45 రోజులు పాటు జైల్లో ఉండి వచ్చిన అప్పలరాజును  సత్కరించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి జి కోటేశ్వరరావు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో రైతుల భూములను లాక్కొని రైతులకు భూములు లేకుండా కార్పొరేట్లకు ధారాధత్వం చేస్తున్నారు రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకపోగా ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతులను మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెట్టుతున్నారు యుద్ధం పేరుతో రైతులు పండించే వాణిజ్య పంటలకు ధరలకు అమ్ముకుంటున్నారని యూరియా దొరక్క ఎరువులు ధరలు పెరిగిపోతున్నాయి విద్యుత్ సంస్కరణ పేరుతో విద్యుత్ ధరలు పేరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విత్తన బిల్లు ,వ్యవసాయ నల్ల చట్టాలు  రద్దు ఆయ్యoత వరకు రైతుల అంతా పోరాడాలని జిల్లాలో ముసివేసిన షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని కొండకర్ల ఆవను ఆధునికరించి రైతులు, మత్స్యకారులకు ఉపయోగపడేలా చర్యలు తీసుకొని బెల్లం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, అనకాపల్లి టు అచ్చుతాపురం రోడ్డు నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలని రైతులు నిర్వాసితులు ఐక్యంగా రైతు సమస్యలపై పోరాడాలని  పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు ,రైతు సంఘం నాయకులు దొడ్డి కృష్ణ, తనకాల జగ్గారావు, సన్యాసిరావు, బ్రహ్మాజీ కె సోమునాయుడు, ఎస్ రాము నాయుడు ఎస్ అప్పారావు బి శ్రీనివాసరావు ఎం.రవణ తది తరులు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter