కూటమి ప్రభుత్వ పాలన – రాష్ట్ర భవితవ్యానికి సువర్ణ మార్గం: బడేటి చంటి
09/May/2026 21:09
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు ఖచ్చితత్వంతో కూడిన దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తూనే రాష్ట్ర భవితవ్యానికి సువర్ణ మార్గాన్ని నిర్దేశించే స్థాయిలో కూటమి ప్రభుత్వ పాలన కొనసాగుతోందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఇదేతరుణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి సైతం సమప్రాధాన్యతనిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏలూరులోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ప్రజలకు అందుబాటులో ఉన్న ఆయన,,, తనను కలిసేందుకు విచ్చేసిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారినుండి వినతులు స్వీకరించీ, సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా కల్పించీ, అండగా ఉంటానంటూ ధైర్యం చెప్పారు. అనంతరం ఆయా సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి బంగారు బాటలు వేసేలా తాము ముందుకెళ్తున్నామని వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో జఠిలమైన ప్రజా సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారాలు చూపనున్నట్లు ఆయన భరోసా కల్పించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...