దేశం గర్వించదగ్గ ఉద్యమ నాయకుడు చండ్ర రాజేశ్వరరావు.
06/June/2026 20:49
Share:
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి, ఏలూరు. భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ)ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో సిపిఐ అగ్ర నేత, మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు 112 వ జయంతి ఆర్.ఆర్.పేట,స్ఫూర్తి భవన్ నందు జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా సమితి సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు చండ్ర రాజేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రాజేశ్వరరావు 1914 కృష్ణాజిల్లా చల్లపల్లి ప్రాంతంలో చండ్ర రాజేశ్వరరావు జన్మించారని, ఆయనను సహచరులంతా సి.ఆర్ అని ఆప్యాయంగా పిలిచే వారని తెలిపారు.80 సంవత్సరాలు పాటు సి.ఆర్ తన జీవితకాలంలో ఆరు దశాబ్దాలకు పైగా స్వాతంత్ర్య పోరాటంలో, ప్రజాసేవలో కొనసాగిన గొప్ప నేత అని కొనియాడారు.1934లో పుచ్చలపల్లి సుందరయ్య తదితర నాయకులతో కలిసి దున్నే వాడికే భూమి కావాలనే నినాదంతో దేశ వ్యాప్త ఉద్యమాలకు పిలుపునిచ్చిన గొప్ప నేత సి.ఆర్ అని అన్నారు. 1968లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల వ్యవసాయ కార్మికులను సంఘటిత పరిచి భారత్ ఖేత్ మజ్దూర్ యూనియన్ నిర్మాణం చేసి జమీందారుల వద్ద భూస్వాముల దగ్గర అన్యాక్రాంతమైన లక్షలాది ఎకరాల భూములను పోరాటాల ద్వారా వ్యవసాయ కార్మికులకు దక్కించిన గొప్ప వ్యక్తి సి.ఆర్ అని అన్నారు. సిఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి మన దేశంలో, రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో పార్టీ పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ గొప్ప కమ్యూనిస్టు నాయకుడు, తన జీవిత కాలమంతా పేద ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సి. ఆర్ అని కొనియాడారు. కృష్ణాజిల్లా చల్లపల్లి తాలూకాలో సంపన్న ధనిక రైతు కుటుంబంలో జన్మించిన సి.ఆర్ తెల్ల దొరల పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అణచివేతకు వ్యతిరేకంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించాలని చదువుకునే వయస్సులోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు సి.ఆర్, బాబ్రీ మసీదు కూల్చివేతను నిరసిస్తూ, ఆర్.ఎస్.ఎస్ శక్తుల మతోన్మాదానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటాలు చేసిన ఉద్యమ నేత సి.ఆర్ అని కొనియాడారు. ఆయన చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు ఉద్యమాలలో పాల్గొనాలని అదే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం అనేక పోరాటాలు చేసిన కమ్యూనిస్టు పార్టీ నాయకుడు చండ్ర రాజేశ్వరరావు గొప్ప నాయకుడు అని కొనియాడారు. ఆయన చేసిన పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలలో పనిచేయడం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళిని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు జిల్లా సమితి సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు.సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్.ఏఐటీయూసీ జిల్లా కోశాధికారి పుప్పాల కన్నబాబు సిపిఐ ఏలూరు ఏరియా సమితి సహాయ కార్యదర్శి కురెళ్ళ వరప్రసాద్,కార్యవర్గ సభ్యురాలు మావూరి విజయ, కొల్లూరి సుధారాణి,గొర్లి స్వాతి, శాయన అభిలాష్ కుమార్,బళ్ల కనక దుర్గారావు, దాసిపల్లి ఆదినారాయణ, వల్లెపు అబ్రహం తదితరులు పాల్గొన్నారు.