ములకలపల్లి గ్రామపంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన
12/March/2026 07:51
Share:
యలమంచిలి : నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు యలమంచిలి మండలం, ములకలపల్లి గ్రామపంచాయతీ భవనం నిర్మాణం కొరకు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్రాంట్ నిధులతో మంజూరైన గ్రామపంచాయతీ భవనం పనికి మండల పరిషత్ అధ్యక్షులు రాజాన సూర్య చంద్ర శేష గిరి రావు (శేషు) శంకుస్థాపన చేశారు. ములకలపల్లి గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణానికి అంచనా విలువ రూ. 32.లక్షలు మంజూరు అయ్యాయని, నిధుల నుండి 7 లక్షలు, నాశ్రయ గ్రామ (ఆర్ జిఎస్ఏ) గ్రాంట్ నుండి 25 లక్షలు మంజులయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు లాలం సోమనాయుడు, ములకలపల్లి జనసేన నాయకులు అచ్యుతరావు, శివ, కూటమి నాయకులు పాల్గొన్నారు.