టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

29/March/2026 15:01    Share:   

క్రైమ్ అనాల్సిస్ టివియస్ ప్రకాష్,
యలమంచిలి రూరల్ కొత్తలి పంచాయతీ పరిధిలోని పేరంటాలపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ భీమిరెడ్డి ఎర్రాపాత్రుడు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా భీమిరెడ్డి ఎర్రాపాత్రుడు మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం గర్వకారణమని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయని, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు రాజాన మోహన్రావు, పార్టీ నాయకులు రాజాన కోటబాబు (డైరీ ప్రెసిడెంట్), రుత్తల మల్లునాయుడు, రాజన్న అప్పలనాయుడు, కాళ్ల అప్పారావు, టివియస్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ, ఎన్టీఆర్ పేదలపాటి దేవుడిగా నిలిచారని, ఎల్లప్పుడూ పేదల పక్షాన నిలిచిన మహానాయకుడని గుర్తుచేశారు.అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి, “జై తెలుగుదేశం… జై జై తెలుగుదేశం” అంటూ నినాదాలతో కార్యక్రమాన్ని ఉత్సాహంగా ముగించారు. గ్రామంలోని పలువురు కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter