తాళ్లపాలెం గ్రామంలో “100 డేస్ యాంటీ డ్రగ్ 0.2” అవగాహన కార్యక్రమం..
08/May/2026 06:39
Share:
విశాఖపట్నం డీఐజీ శ్రీ గోపీనాథ్ జెట్టి గారు, అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించబడింది. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉండటమే కాకుండా మానసిక స్థితి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఎంతోమంది యువత మత్తు పదార్థాలకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా దెబ్బతీస్తున్నారని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకోవడమే కాకుండా తన భవిష్యత్తును కూడా అంధకారంలోకి నెట్టుకుంటున్నాడని వివరించారు. అదేవిధంగా మహిళల భద్రత, మహిళలపై జరిగే నేరాలు మరియు వాటి నివారణకు పోలీసులు తీసుకుంటున్న చర్యల గురించి ప్రజలకు వివరించబడింది. ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని సూచించారు. అలాగే ప్రజలు పోలీసు అత్యవసర సేవలు అవసరమైనప్పుడు శక్తి యాప్ వంటి అప్లికేషన్లను సద్వినియోగం చేసుకుని తక్షణ సహాయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు శ్రీ ద్వారపురెడ్డి పరమేశ్వరరావు గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ పొన్నగంటి అప్పారావు గారు, శ్రీ సురేంద్ర మోహన్ గారు, బీజేపీ శ్రేణులు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .