యలమంచిలి,
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మరియు యలమంచిలి నియోజక వర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు , గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ మరియు నియోజకవర్గ పరిశీలికలు పారాబత్తుల రాజశేఖర్ హాజరయ్యారు. ముందుగా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతుల స్వీకరించారు. అనంతరం పార్లమెంట్ సభ్యులు పప్పల చలపతిరావు మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలను ప్రతి ఒక్కరు పాటించాలని తెలిపారు. ప్రగడ నాగేశ్వరావు మాట్లాడుతూ 2026 లో భాగంగా ఓటర్ డ్రాప్ట్ లిస్టును క్షుణ్ణంగా పరిశీలించాలని, సరైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూటమి పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని, రెండు సంవత్సరాల్లో చేసిన మంచి పనిని ప్రజలకు వివరిస్తూ, ప్రజలతో మమేకం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రాజన రమేష్ కుమార్, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ ధూళి. రంగనాయకులు, గవర కార్పొరేషన్ డైరెక్టర్ భీమరశెట్టి. శ్రీనివాసరావు, మాదిగ కార్పోరేషన్ డైరెక్టర్ డొక్కా. నాగభూషణం,కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మామిడి శివ అప్పారావు, మండల అధ్యక్షులు ఇత్తంశెట్టి. సన్యాసినాయుడు, గొర్లి. నానాజీ,లాలం. భరత్, పీల. తులసీరామ్, పెంటకోట. విజయ్, ఆడారి. జానకి, రేబాక మాలతి,దాడి. రమేష్ , రాంబిల్లి పిఎసిఎస్ చైర్మన్ ఎరిపల్లి. చిట్టిబాబు క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.