వాతావరణ మార్పుల ఆధారిత పంటల ప్రణాళిక పై దృష్టి,కృషి విజ్ఞాన కేంద్రం చైర్మన్ భాగవతల శ్రీరామమూర్తి
10/March/2026 22:09
Share:
- కెవికె 26వ శాస్త్రీయ సలహా సమావేశం యలమంచిలి,రాంబిల్లి: నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయడానికి మరింత కృషి చేయవలసి ఉందని బిసిటీ కృషి విజ్ఞాన కేంద్రం చైర్మన్ భాగవతల శ్రీరామమూర్తి అన్నారు. మంగళవారం కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన 26వ శాస్త్రీయ సలహా సంఘం సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సరళిలో కూడా కొద్దిపాటు మార్పులు చేసుకోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు. అనకాపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం, పరిశోధనా సహ సంచాలకులు, డాక్టర్ సిహెచ్. ముకుందరావు సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, జిల్లాలోని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు అభ్యుదయ రైతులు హాజరయ్యారు. సహాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ వి. విశాలాక్షి మాట్లాడుతూ సేంద్రీయ ప్రకృతి వ్యవసాయ విధానాలను మరింత ప్రోత్సహించవలసిన అవసరాన్ని వివరించారు. జీవన ఎరువులు, లింగాకర్షక ఎరలు వంటి ఖర్చు తగ్గించే నేల సారాన్ని పెంచే వనరులు కెవికెలో అందుబాటులో ఉండాలని అన్నారు. చింతపల్లి పరిశోధనా స్థానం సహసంచాలకులు డాక్టర్ ఏ. అప్పలస్వామి, జిల్లాలోని వ్యవసాయ, అనుబంధ రంగాల నుంచి ఝాన్సీ లక్ష్మి, ఉమా ప్రసాద్, విజేత, తులసీమణి, శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ కుమారి, డాక్టర్ రాజ్ కుమార్, ఆకాశవాణి నుంచి సుధాకర్ రెడ్డి నా దాంట్లో స్పేస్ అయిపోయిందని తెలిపారు. అభ్యుదయ రైతులు కన్నమ నాయుడు, తోట గణేష్, రాజు, గంట ముని, లక్ష్మణ్, శ్రీను, పాము భూషణం తదితరులు పాల్గొని జిల్లాలోని పంటల సరళి, పంటలలో సమస్యల గురించి చర్చించారు. శాస్త్రవేత్తలు గత సంవత్సరం కెవికే ద్వారా చేసిన కార్యక్రమాలను, వచ్చే సంవత్సరానికి చేపట్టబోయే ప్రణాళిక కార్యక్రమాలను వివరించారు.