విశాఖపట్నంలో అంతర్జాతీయ నావికాదళాల కవాతు:

విశాఖపట్నంలో అంతర్జాతీయ నావికాదళాల కవాతు:

21/February/2026 08:17    Share:   

సముద్ర తీరంలో సంబరాలు
విశాఖపట్నం: నగరంలోని సముద్ర తీరం గురువారం సాయంత్రం అంతర్జాతీయ స్థాయి వేడుకలకు వేదికైంది. అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష - మిల్లన్ 2026 వేడుకల్లో భాగంగా భారత నావికాదళంతో పాటు పలు మిత్ర దేశాల నావికాదళాలు పాల్గొన్నాయి.ఈ సందర్భంగా తొలుత భారత నావికాదళానికి చెందిన యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు గగనతలంలో అద్భుత ప్రదర్శన చేస్తూ అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం భారత నావికాదళం, సైన్యం, వాయుసేన, తీర రక్షక దళాల కంటింజెంట్లు సాగర్ తీరంలో కవాతు నిర్వహించాయి.ఈ కవాతులో అమెరికా, రష్యా, బ్రిటన్, బంగ్లాదేశ్, శ్రీలంక సహా పలు మిత్ర దేశాల నావికాదళ సిబ్బంది తమ సంప్రదాయ దుస్తులు, పాల్గొని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కమాండోల సాహస కృత్యాలు, డ్రోన్ లైట్ షో, చివరిలో జరిగిన బాణాసంచా వెలుగులు తీరాన్ని దృశ్యకావ్యంగా మార్చాయి.ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. వివిధ దేశాలకు చెందిన కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలతో సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించారు.సముద్ర భద్రతలో సహకారాన్ని మరియు మిత్ర దేశాలతో సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకోవడమే ఈ కవాతు ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. ఈ అంతర్జాతీయ వేడుకను తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో  విశాఖపట్నం నగరంలోని సముద్ర తీరంపరిసరాలు జనసంద్రంగా మారాయి. నిర్వాహకులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Breaking News

Subscribe our Newsletter