ఆశా భోస్లే కన్నుమూత భారతీయ సంగీత రంగానికి అపారమైన కీర్తి తెచ్చిన లెజెండరీ గాయని ఆశా భోస్లే (92) ఇక లేరు. శనివారం సాయంత్రం ఆమెకు గుండెపోటు రావడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు. ఆదివారం ఉదయం వరకు చికిత్సకు స్పందించినప్పటికీ మధ్యాహ్నం ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ఆశా భోస్లే అంత్యక్రియలు ముంబైలోని శివాజీ పార్క్లో సోమవారం, ఏప్రిల్ 13న సాయంత్రం 4 గంటలకు జరుగనున్నాయి.
ఉదయం 11 గంటలకు కాసా గ్రాండే, లోవర్ పరెల్ వద్ద ఆమె మృతదేహాన్ని ప్రజల నివాళుల కోసం ఉంచనున్నారు.
ప్రభుత్వం ఆమెకు స్టేట్ ఫ్యూనరల్ నిర్వహించనున్నట్లు మంత్రి అశిష్ శెలార్ ధృవీకరించారు.