మున్సిపల్ కార్మికుల పోరుబాట: అనకాపల్లి జీవీఎంసీ కార్యాలయం ముట్టడి

మున్సిపల్ కార్మికుల పోరుబాట: అనకాపల్లి జీవీఎంసీ కార్యాలయం ముట్టడి

30/March/2026 11:37    Share:   

జీతాలివ్వండి.. పోస్టులు భర్తీ చేయండి: అనకాపల్లిలో CITU ఆధ్వర్యంలో నిరసన
క్రైమ్ ఎనాలిసిస్ జిల్లా ఇంచార్జ్ శ్రీనివాస్
అనకాపల్లి జీవీఎంసీ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్‌కు చెందిన సిబ్బంది సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు తమకు బకాయి ఉన్న జీతాలను తక్షణమే చెల్లించాలని, అలాగే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని మరియు సంబంధిత అధికారులను కోరారు.
నిరసనలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు నగర శుభ్రత, ప్రజా సేవల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయితే, జీతాల చెల్లింపులో ఆలస్యం కావడం వల్ల కార్మికులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఖాళీ పోస్టులు ఎక్కువగా ఉండటంతో ఉన్న సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యలను త్వరగా పరిష్కరించాలని, కార్మికులకు న్యాయం చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు.
Breaking News

Subscribe our Newsletter