అనకాపల్లి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక.. అధ్యక్షుడిగా గణేష్, కార్యదర్శిగా భవాని
10/April/2026 19:44
Share:
అనకాపల్లి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన గౌరవాధ్యక్షులు లాలం చందు మాట్లాడుతూ, జిల్లా ఫుట్‌బాల్ క్రీడాకారుల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలను పూర్తిస్థాయిలో అందజేస్తానని తెలిపారు. ప్రతి గ్రామం నుంచి ప్రతిభావంతమైన ఫుట్‌బాల్ క్రీడాకారులను తీర్చిదిద్దే బాధ్యతను సంఘ సభ్యులు తీసుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గణేష్,ఉపాధ్యక్షులుగా చల్లా సుస్మిత,కార్యదర్శిగా బోదెపు భవాని,సంయుక్త కార్యదర్శిగా రుద్రపంతి నరేష్,కోశాధికారిగా మోహన్ రావు, ఎన్నికయ్యారు. సభ్యులుగా జి. భాగ్యరేఖ, కె. శేషగిరి, ఆర్. నరేంద్రలను ఎంపిక చేయగా, కో-ఆప్షన్ సభ్యులుగా బోదెపు రామకృష్ణ, ఏ.బి.ఎల్. రాజు, పిల్లా రాములను నేషనల్ స్పోర్ట్స్ కోటా ద్వారా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు దుస్తులు మరియు ఫుట్‌బాల్ బూట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సూర్యనారాయణ, ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధి జి. పవన్, ఏపీఎఫ్ఏ కోఆర్డినేటర్ నీలాద్రి ఎన్నికల పర్యవేక్షకులుగా పాల్గొన్నారు. ఎన్నికల అధికారి న్యాయవాది నాగిరెడ్డి సత్యన్నారాయణ ఎన్నికలను నిర్వహించి ఫలితాలను ప్రకటించారు.ఈ సందర్భంగా పలు క్రీడా సంఘాల ప్రతినిధులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు.