( క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్ )
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామ సచివాలయంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. అనకాపల్లి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుల ఆదేశాల మేరకు, ఎలమంచిలి మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు శెన్నం శెట్టి శ్రీను గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశ సమగ్రత కోసం చేసిన త్యాగాలు, దేశభక్తి, జాతీయ సమైక్యతకు అందించిన సేవలను నాయకులు స్మరించారు.
దేశం కోసం అంకితభావంతో పనిచేసిన మహానేతల ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సచివాలయ అధికారులు, జిల్లా ఆర్టిజన్ సెల్ నాయకులు మొల్లేటి ప్రసాద్, మాజీ చైర్మన్ నాగిరెడ్డి సత్యనారాయణ, వేగి రామకృష్ణ, టి. రవి, ఎన్. చిరంజీవి, ఎన్. శ్రీను, షేక్ సాయిబాబా, మైలారి గోవిందు, రాజు, బాబ్జి, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.