రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఏలూరు రెడ్డి అప్పల నాయుడు గారు ప్రత్యేక పూజలు..

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఏలూరు రెడ్డి అప్పల నాయుడు గారు ప్రత్యేక పూజలు..

21/April/2026 20:12    Share:   

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఏలూరు పోస్టల్ కాలనీలో ఉన్న శ్రీ వల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రెడ్డి అప్పల నాయుడు గారు ప్రత్యేక పూజలు..
కొండల ప్రసాద్ CA న్యూస్ ఇంచార్జి,
ఏలూరు, ఏప్రిల్,రాష్ట్ర ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మంగళవారం స్థానిక 20 డివిజన్ పోస్టల్ కాలనీలో ఉన్న శ్రీ వల్లీదేవ సేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం లో ఏలూరు జనసేన నగర కమిటీ ఆధ్వర్యంలో రెడ్డి అప్పల నాయుడు గారు ప్రత్యేక పూజలు, అర్చనలు, శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు గారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఇటీవల ముక్కుకి శస్త్ర చికిత్స చేయించుకోవడం జరిగింది. కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, రైతుల కోసం, యువత కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అలుపెరగని శ్రామికుడిగా పనిచేస్తున్నటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో త్వరగా కోలుకొని, మళ్లీ ప్రజాక్షేత్రంలో యధావిధిగా, ఆయన తీసుకున్న శాఖలలో విధులు నిర్వహించే విధంగా, శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మా తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు అందరి ఆశీస్సులు, మా అందరి ఆయుష్షును ఆయనకి భగవంతుడు ఇచ్చి, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి, రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని ఈరోజు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ఎంతో పేద, బడుగు, బలహీన వర్గాల కుటుంబాల నుండి వచ్చిన తాను ఈరోజు నాయకుడిగా ఏపిఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ గా బాధ్యతలను నిర్వహిస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర  పోషిస్తున్నాము అంటే అది జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల నుంచి, ఆయన ఆశయ సాధనలో మాలాంటి వారందరూ కూడా పనిచేయడం, మాలాంటి వారిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి, కొన్ని బాధ్యతలు ఇవ్వడం, మా అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా తన శక్తికి మించి పనిచేసి పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తామని అప్పలనాయుడు తెలిపారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో మా అధినేత, శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రాపర్తి సూర్య నారాయణ, నగర అధ్యక్షులు వీరంకి పండు, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, నాయకులు నగిరెడ్డి కాశీ నరేష్, సరిది రాజేష్, రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, ఎట్రించి ధర్మేంద్ర, కొండల ప్రసాద్, కూనిశెట్టి మురళీ కృష్ణ, వాసా సాయి,ప్రేమ్ కుమార్, స్థానిక నాయకులు గొడవర్తి నవీన్, అచ్యుత్, నాని, మల్లెమొగ్గల బాలాజీ, కొండేటి రమేష్, కూన అనసూయ మరియు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు...
Breaking News

Subscribe our Newsletter