ఏటికొప్పాక అభివృద్ధికి కార్యాచరణ... ప్రజా సమస్యలపై అధికారుల స్పందన..!

ఏటికొప్పాక అభివృద్ధికి కార్యాచరణ... ప్రజా సమస్యలపై అధికారుల స్పందన..!

27/June/2026 18:33    Share:   

యలమంచిలి జూన్ 27 (క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
ఏటికొప్పాక గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుధ్యం, తాగునీరు, డ్రైనేజీ, అభివృద్ధి పనులు తదితర సమస్యలపై పంచాయతీ కార్యదర్శి కె. గిరిప్రసాద్తో కలిసి మాజీ సర్పంచ్ కాంట్రాకోట చిరంజీవి, అన్నం బాబ్జి, వైస్ ఎంపీపీ నాగిరెడ్డి అచ్చయ్య నాయుడు, కొండయ్య నాయుడుతో పాటు క్రైమ్ న్యూస్ రిపోర్టర్ ఆనంద్ గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని నాయకులు కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కార్యదర్శి గ్రామంలో తడి చెత్త–పొడి చెత్తను వేరుగా వేయాలని, ఎక్కడపడితే అక్కడ చెత్త వేయవద్దని, తాగునీటి కుళాయిలకు అక్రమంగా మోటార్లు బిగించి నీటిని నిల్వ చేయవద్దని ప్రజలకు సూచించారు.
అలాగే పంచాయతీ సిబ్బంది విధి నిర్వహణ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యలతో వచ్చిన ప్రతి ఒక్కరితో మర్యాదగా స్పందించి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, వారికి అవసరమైన సేఫ్టీ ఎక్విప్‌మెంట్‌లు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శి పేర్కొన్నారు.
గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా వెంటనే పంచాయతీ దృష్టికి తీసుకురావాలని, అధికారులు–ప్రజలు–గ్రామ నాయకులు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాభివృద్ధి వేగవంతమవుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపుతో పాటు సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు.
Breaking News

Subscribe our Newsletter