ఆపరేషన్ “వజ్రప్రహార్” లో భాగంగా అనకాపల్లి సబ్-డివిజన్ లో "మెగా కార్డన్ అండ్ సర్చ్ ”

ఆపరేషన్ “వజ్రప్రహార్” లో భాగంగా అనకాపల్లి సబ్-డివిజన్ లో "మెగా కార్డన్ అండ్ సర్చ్ ”

12/March/2026 20:27    Share:   

తేది: 12-03-2026 (గురువారం)
కాలనీ, చేపల బజార్, విజయరామరాజుపేట, అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ అనకాపల్లి సబ్-డివిజన్‌, అనకాపల్లి జిల్లా .
DGP శ్రీ హరీష్ కుమార్ గుప్తా,IPS.,ఆదేశముల మేరకు ఈగల్ చీఫ్ ఆకే రవి కృష్ణ IPS., మరియు గోపీనాధ్ జెట్టి విశాఖపట్నం రేంజ్ IGP పర్యవేక్షణలో,అనకాపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్,Tuhin sinha IPS పర్యవేక్షణలో మరియు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, శ్రీమతి M.శ్రావణి ఆద్వర్యములో అనకాపల్లి టౌన్ (L&O),అనకాపల్లి టౌన్ ట్రాఫిక్ మరియు అనకాపల్లి రూరల్ సర్కిల్ పోలీస్ స్టేషన్లకు చెందిన సి.ఐ.లు మరియు ఎస్.ఐ.లు, సిబ్బంది, ఈగల్ టీం,స్పెషల్ పార్టీ  మొత్తం115 మంది తో SDPO, అనకాపల్లి  వారి ఆద్వర్యములో జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం“ఆపరేషన్ వజ్రప్రహార్”లో భాగంగా,అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో  AMC కాలనీ,చేపల బజార్,విజయరామరాజుపేటలో 12-03-2026 గురువారం రోజు మెగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించబడింది. రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా మరియు సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టబడ్డాయి.
ఈ మెగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్‌ను శ్రీమతి M.శ్రావణి, SDPO ఆధ్వర్యంలో నిర్వహించారు.పోలీసు అధికారులు, సిబ్బంది, స్పెషల్ టీమ్‌లు కలిసి AMC కాలనీ లోగల గృహ సముదాయాలు,పాడుబడిన ఇల్లు,ఇతర ప్రదేశాలలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.గతంలో గంజాయి కేసులలో ప్రమేయం ఉన్నటువంటి ముద్దాయిల ఇంటిల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఈ కార్డన్ & సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 14 మంది పోలీసు అధికారులు మరియు 90మంది  సిబ్బంది పాల్గొని AMC కాలనీ లో ఇల్లులను,వ్యక్తులను తనిఖీచేశారు,వాహనాలను తనిఖీ చేసి రికార్డ్స్ లేని 09 మోటార్ సైకిళ్ళును స్వాధీన పరచుకోవడమైనది.నిమ్మకాయల జ్యోతి సూర్య ప్రభాకర్@జ్యోతి S/o (లేటు)ఆప్పలరాజు అనే ఆసామి ఇంటి వద్ద నుండి 03 KG ల గంజాయి మూటను,దొడ్డి తిమోతి@ఆది ఇంటి వద్ద 04 కేజిల గంజాయిని,అదే విధముగా మల్లంపర్తి గణేష్@రామ్స్ సన్ ఆఫ్ చిన్నారావ్ అను వాని ఇంటి వద్ద డ్రగ్ ఇన్స్పెక్టర్ సమక్షములో MEPHENTRMINE SULPHATE Injection I.P. బాటిల్స్ ను వశపరచుకోవడమైనది.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు ప్రజలకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక మరియు చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ EAGLE టోల్ ఫ్రీ నెంబర్ 1972 మరియు 100 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది మరియు ప్రజలతో కలిసి “ఆపరేషన్ వజ్రప్రహార్ ప్రతిజ్ఞ” నిర్వహించి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేశారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” కింద ఇలాంటి ప్రత్యేక చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
 
Breaking News

Subscribe our Newsletter