మహిళలకు చట్టాలపై అవగాహన. మహిళల భద్రతకు పోలీసుల పూర్తి సహకారం.

మహిళలకు చట్టాలపై అవగాహన. మహిళల భద్రతకు పోలీసుల పూర్తి సహకారం.

26/April/2026 07:44    Share:   

అనకాపల్లి రూరల్ మండలంలోని గొలగాం గ్రామపంచాయతీ పరిధిలోని మహిళలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని అనకాపల్లి రూరల్ పోలీసులు శనివారం నిర్వహించారు. సీఐ జి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత ముఖ్యమని ప్రతి మహిళా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని మహిళలను సంరక్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను రూపొందించిందని మహిళల భద్రతకు పోలీసుల పూర్తి సహకారం ఉంటుందన్నారు. అత్యవసర సమయాల్లో మహిళలు డయల్ 100, 1098, 181 హెల్ప్ లైన్ నెంబర్లు ఫోన్ చేయడం ద్వారా సహాయం పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రవికుమార్, అనకాపల్లి రూరల్ పోలీసులు, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
Breaking News

Subscribe our Newsletter