జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్ అనే అంశంపై స్వచ్ఛత కార్యక్రమం
28/March/2026 18:53
Share:
యలమంచిలి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి నెల మూడో శనివారం జరిగే కార్యక్రమంలో ఈనెల థీమ్ అయినటువంటి జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ -అనే అంశంపై స్వచ్ఛత కార్యక్రమాలు కమిషనర్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీనగరంలో గల బిసి హాస్టల్ నందు తడి,పొడి చెత్తను వేరు చేసిన అనంతరం హాస్టల్ నుంచి వచ్చిన తడి చెత్తను ఆన్ సైట్ కంపోస్టింగ్ చేయడం జరిగింది. అనంతరం బీసీ హాస్టల్ నుండి మిత్ర అపార్ట్మెంట్ వరకు ర్యాలీగా వెళ్లి ప్రతి అపార్ట్మెంట్ వద్ద తడి చెత్త, పొడి చెత్త వేరు చేయుటంపై అవగాహన కల్పించి అనంతరం మానవహారం గా ఏర్పడి అక్కడి అపార్ట్మెంట్ వాసులు మరియు ఇతర పబ్లిక్ తో కమిషనర్ స్వచ్ఛత ప్రతిజ్ఞను చేసారు. అనంతరం13 సచివాలయాల పరిధిలో ఉన్న స్కూళ్లలో,మరియు కాలేజీల్లో పై పేర్కొన్న అంశంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెప్మా,మునిసిపల్,సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.