సుందరపు విజయకుమార్ చొరవతో వీధి రోడ్ల అభివృద్ధికి శ్రీకారం..!!

సుందరపు విజయకుమార్ చొరవతో వీధి రోడ్ల అభివృద్ధికి శ్రీకారం..!!

25/June/2026 07:09    Share:   


క్రైమ్ అనాల్సిస్ | టివియస్ ప్రకాష్  :
యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని ఏఎస్‌ఆర్ కాలనీ, రాంనగర్ సచివాలయం పరిధిలో వీధి రోడ్ల అభివృద్ధికి రూ.63 లక్షల నిధులు మంజూరై, అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన జరిగింది.స్థానిక ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా రోడ్లు, డ్రైనేజీలు, స్ట్రీట్ లైట్లు, తాగునీటి వంటి మౌలిక సదుపాయాల కొరతతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, వారి సమస్యలను గుర్తించిన కోటారు శ్రీనివాస్ మాస్టర్, కోటారు బాబ్జి, లంకా ఉదయ్ కుమార్ తదితరులు జనసేన పార్టీ ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లారు.ప్రజల సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ చొరవతో ఏఎస్‌ఆర్ కాలనీ, రాంనగర్, శేషకొండ కాలనీ, అత్తిలివారి చేలు తదితర ప్రాంతాల అభివృద్ధి కోసం రూ.63 లక్షల గ్రాంట్ విడుదల చేయించారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకుడు ఊటకూటి రమేష్ నాయుడు చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో కోటారు శ్రీనివాస్ మాస్టర్, శ్రీమంతుల శ్రీనివాస్, లంకా ఉదయ్, దౌలూరు పెంటయ్య, కన్నా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు."ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మౌలిక వసతుల అభివృద్ధికి జనసేన ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని నాయకులు పేర్కొన్నారు.
Breaking News

Subscribe our Newsletter