రాజ్యాంగాన్ని కాపాడుకుందాం - మహిళా లోకం ఏకం కావాలి: ఐద్వా పిలుపు
14/April/2026 22:08
Share:
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ,ఐద్వా అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మోసయ్యపేటలో అఖిలభారత మహిళా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఐద్వా అచ్యుతాపురం కన్వీనర్ ఆర్ లక్ష్మి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నేటి పాలకులు తుంగలోకి తొక్కి దళితులు, మహిళలు ఇతర అనగారిన వర్గాల హక్కులకు భంగం కలిగించే విధంగా రాజ్యాంగాన్ని మారుస్తున్నారని రాజ్యాంగ రక్షణకు మహిళలు ఐక్యంగా పోరాడాలని మహిళలపై హింస, అత్యాచారాలు ,లైంగిక వేధింపు లు అరికట్టాలని, డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలు నిషేధించి మహిళలకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడారికాసులమ్మ, ఆశ, దేవుడమ్మ తదితరులు పాల్గొన్నారు.