జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి. సివిల్ జడ్జి పి. విజయ
10/March/2026 22:14
Share:
ఈ నెల 14వ తేదీన నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి పి. విజయ తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి మాట్లాడుతూ భారత దేశం అంతా నిర్వహిస్తున్న ఈ అదాలత్ లో అన్ని కోర్ట్ లలో ఉన్న క్రిమినల్ కేసులు, అన్ని రకాలైన సివిల్ కేసులు, మోటార్ వాహనాల కేసులు, కుటుంబ వివాదాలు, విడాకుల మనోవర్తి కేసులు, బ్యాంకు బకాయి, చెక్ బౌన్స్ కేసులు, వాహన భీమా సెటిల్మెంట్లు పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ లోక్ అదాలత్ లో వచ్చిన తీర్పు అంతిమ తీర్పుగా పరిగణించబడుతుంది, ఎటువంటి అప్పీలుకు అవకాశం ఉండదు కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.