యలమంచిలి: అంగన్వాడి సమస్యలపై సోమవారం చలో విజయవాడ వెళ్లిన అంగన్వాడి టీచర్లు, ఆయాలు శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై మంగళవారం తెల్లవారుజామున టెంట్లు లాగి బ్యానర్లు చింపి అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై నిర్బంధం ప్రయోగించి అక్రమ అరెస్టులకు పాల్పడింది దీనిని నిరసిస్తూ యలమంచిలి కాంప్లెక్స్ వద్ద నిరసన తెలియజేయడం జరిగిందని అన్నారు .ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్ రాము యలమంచిలి ప్రాజెక్టు నాయకులు బి శశికళ మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 42 రోజులు అంగన్వాడీలు సమ్మె చేసిన సందర్భంగా స్వయంగా లోకేష్ టెంట్ దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. హామీ ఇచ్చి రెండు సంవత్సరాల దగ్గర పడుతున్న నేటికీ పరిష్కరించలేదని గతంలో ఇచ్చిన హామీను వెంటనే అమలు చేసి అంగన్వాడీ టీచర్లు ఆయాలకు వేతనాల పెంచాలని మహిళలను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని వెంటనే అరెస్టు చేసిన వారిని విడుదల చేసి మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి సోమలక్ష్మి, ఎం రమ్య, బి చిన్న తల్లి, జి భవాని తదితరులు పాల్గొన్నారు.